కోక్యతండాలో వ్యవసాయ బావిలో వృద్ధురాలి మృతదేహం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యతండా సమీపంలోని వ్యవసాయ బావిలో వృద్దురాలి మృతదేహం లభ్యమైంది. అదే తండాకు చెందిన బానోతు కమలమ్మ(65) గా గుర్తించారు. రెండు రోజుల క్రితం బావిలో పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. భర్త లేకపోవడంతో కొడుకుల వద్ద జీవనం సాగిస్తున్న కమలమ్మ ఇలా మృతి చెందడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతదేహాన్ని వెలికితీస్తున్న ఫైర్ సిబ్బంది. కమలమ్మ మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్