ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వైద్య అధికారులు ఆదివారం ప్రారంభించారు. బోదులబండ, తిరుమలాపురం, రామచంద్రపురం, పైనంపల్లి గ్రామాల్లో సర్పంచులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సర్పంచులు పిలుపునిచ్చారు.