మొంథా తుఫాను ప్రభావంతో ఎగువ వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా పాలేరు జలాశయం ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రానికి 48 వేల క్యూసెక్కుల వరద నమోదు కాగా, శుక్రవారం ఉదయం 43 వేలకు తగ్గింది. 25.70 అడుగులు ఉన్న నీటి మట్టం 25.20 అడుగులకు తగ్గింది. ఈరోజు సాయంత్రానికి మరింత తగ్గే అవకాశం ఉంది.