కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లే మార్గంలో రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంత కారణంగా ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని, రోడ్డు బురదమయంగా మారిందని ప్రజలు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి సమస్యను పరిష్కరించాలని కోరారు.