అత్తింటి వేధింపులు తట్టుకోలేక మౌనిక (24) ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన సపావత్ కృష్ణాప్రసాద్‌కు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని భాసిత్నగర్‌కు చెందిన తేజావత్ మౌనికతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త మద్యానికి అలవాటు పడి అనుమానంతో ఇబ్బంది పెడుతుండడంతో పది రోజుల క్రితం మౌనిక పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం ఫోన్‌లో జరిగిన వేధింపులకు మనస్తాపంగా ఫ్యానుకు ఉరి వేసుకుంది.