ఖమ్మం: కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా పని చేయాలి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆదివారం ఏదులాపురంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ సహజమేనని, అయితే వార్డుకు ఒకే అభ్యర్థి ఉండేలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధాలుగా ప్రతి ఇంటి గడప తట్టి, కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్