ఖమ్మం: కేంద్రం తప్పుకున్నా... తాము కొనుగోలు చేస్తున్నాం

పంటలకు మద్దతు ధర ప్రకటించినా కొనుగోళ్ల బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని, సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ. 500 బోనస్ కూడా అందిస్తోందని తెలిపారు. అంతేకాకుండా, 25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేశామని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత సోమవారం నుంచి ప్రారంభమవుతుందని కూడా ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్