దేశభక్తి ముసుగులో అరాచకాలు సృష్టిస్తూ బీజేపీ తమ పబ్బం గడుపుకుంటుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో జరిగిన మండల సీపీఎం శిక్షణ తరగతుల్లో ఆదివారం మతం-మతోన్మాదం అనే అంశాలపై మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, దేవుళ్ళ పేరుతో ప్రజలను విభజిస్తూ ప్రజల్లో ఐక్యత లేకుండా విడగొట్టడం ఈ దేశానికి ప్రమాదకరమన్నారు.