ఖమ్మం రూరల్: డివైడర్ ను ఢీకొన్న బైక్... యువకుడు మృతి

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్