ఖమ్మం రూరల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర

మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వీబీజీ రాంజీ చట్టంగా పేరు మార్పు చేస్తూ కేంద్రం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయు, రైతుసంఘం ఆధ్వర్యంలో ప్రచార జాతా నిర్వహించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం యం. వి. పాలెంలో నిర్వహించిన ఈ జాతాను రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత పేదల కోసం రూపొందించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్