ఖమ్మం రూరల్: రైతు భరోసా వెంటనే ఇవ్వాలి

యాసింగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందించాలని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో రైతు సంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యాసింగి సమయం ముగిసినా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్