ఖమ్మం రూరల్, కామేపల్లి, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 సర్పంచ్, 1,686 వార్డు స్థానాలకు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కామేపల్లి మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 229, వార్డులకు 587 నామినేషన్లు దాఖలయ్యాయి. ముదిగొండ, కూసుమంచి మండలాల్లో నామినేషన్లపై రాత్రివరకు స్పష్టత రాలేదు.