ఖమ్మం రురల్ మండలం పొన్నేకల్ నుండి కొండాపురం వరకు రూ. 520 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, TGIDC ఛైర్మెన్ మువ్వా విజయబాబు, కలెక్టర్ దివాకర, మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు.