ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా. మంగళగూడెంకు చెందిన నరేష్(21) ఖమ్మం నుంచి తన బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా, జేసీబీ వాహనం ఇతనిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నరేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.