తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్వహణ లోపం క్రీడాకారులకు శాపంగా మారుతుంది. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో ఉన్న క్రీడా ప్రాంగణం బురదమయంగా దర్శనమిస్తుంది. ప్రాంగణాలు చిన్నగా ఉండడం, క్రీడా సామగ్రి లేకపోవడంతో యువత, విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఆసక్తి చూపలేదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రాంగణంపై దృష్టి పెట్టి వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక క్రీడాకారులు కోరుతున్నారు. వినియోగంలోకి తేస్తే క్రీడల్లో రాణిస్తామన్నారు.