జలగంనగర్‌లో మిషన్ భగీరథ పైప్ లీకేజీ

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామపంచాయతీ జలగం నగర్ ఎంపీడీవో కార్యాలయం వెనుక మిషన్ భగీరథ పైపులైన్ నెలరోజుల కింద పగిలిపోయింది. అప్పటి నుంచి నీరు వృథాగా పోతున్నా గ్రామపంచాయతీ సిబ్బంది, మిషన్ భగీరథ అధికారులు చూసి కూడా పట్టించుకోవడం లేదు. దీంతో జలగం నగర్ కు నీరు గతంలో మాదిరిగా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్