రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ ఖమ్మం రూరల్ మండల సమితి సభ్యులు వెంపటి సురేందర్ అన్నారు. గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్‌కు చెందిన లబ్ధిదారులకు రూ. 21, 500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఫారసు మేరకు చెక్కులు మంజూరైనట్లు పేర్కొన్నారు.