మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, గురువారం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలోని నామినేషన్ కేంద్రాలను అదనపు డీసీపీ ప్రసాద్ రావు సందర్శించి, పోలీసు భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పోలీసు అధికారులు తమ ఎన్నికల విధుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.