శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పదేళ్లు అధికారంలో ఉండి పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వని బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించారు. ఏదులాపురంలో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే, 32 వార్డుల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.