10వ తరగతిలో 509 మార్కులు సాధించిన కిరణ్ కుమార్

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని గట్టు సింగారం గ్రామానికి చెందిన పండ్ల వ్యాపారి కుమారుడు దివ్వెల కిరణ్ కుమార్, 2026లో 10వ తరగతి పరీక్షల్లో 509 మార్కులు సాధించి గ్రామానికి పేరు తెచ్చాడు. నిరుపేద కుటుంబంలో పుట్టినా, చదువును ఆస్తిగా భావించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కిరణ్ కుమార్ నిరూపించాడు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా రాణించగలరని ఈ విజయం చాటిచెబుతోంది. కిరణ్ కుమార్ను మండల ప్రజలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

సంబంధిత పోస్ట్