కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులుగా పని చేస్తున్న సరితకి పదోన్నతి లభించింది. డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డీపీడీ)గా పదోన్నతి కల్పించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేస్తూ రాష్ట్ర ఏపీసీ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులుగా రైతు శిక్షణ కేంద్రంలో ఏడీఏగా పనిచేస్తున్న సతీష్ కి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.