కూసుమంచి: విత్తన చట్టానికి లోబడి వ్యాపారం చేయాలి

కూసుమంచిలోని పలు విత్తన దుకాణాలను ఎస్సై నాగరాజుతో కలిసి డీఏఓ పుల్లయ్య బుధవారం తనిఖీ చేశారు. విత్తన వ్యాపారులందరూ విత్తన చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని, నిషేధిత విత్తనాలను విక్రయించినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బిల్లుపై తప్పనిసరిగా రైతు సంతకం తీసుకోవాలని సూచించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి బిల్లు, ఆ ప్యాకెట్లను భద్రపరచుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్