గురువారం కూసుమంచి మండలంలోని కిష్టాపురం గ్రామంలో వరి పరిశోధనా సంస్థ, ఎస్బీఐ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఎస్బీఐ- డీఎస్ఆర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ ఎస్. కవిరాజు, రైతులు నేరుగా వరిని విత్తి మంచి దిగుబడులు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా నేరుగా విత్తిన వరి సాగులో భూమి తయారీ, విత్తన మోతాదు, కలుపు, పోషకాల నియంత్రణ, నీటి యాజమాన్యం, యాంత్రీకరణ ప్రాధాన్యత వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.