కూసుమంచి: దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయం.. మంత్రి పొంగులేటి

దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం అన్నారు. కూసుమంచిలో ఆయన మాట్లాడుతూ, ప్రతి మతం ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడుతామని తెలిపారు. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఇటీవల సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్