ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కూసుమంచి రైతు వేదికలో రైతు వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం ద్వారా రైతులు మంచి లాభాలను పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, అందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.