కూసుమంచి మండలంలోని కూసుమంచి, పాలేరు, నరసింహులగూడెం, కోక్యాతండా, నేలపట్ల గ్రామాల్లోని పురుగుమందులు, ఎరువుల దుకాణాలను బుధవారం డీఏఓ పుల్లయ్య పరిశీలించారు. లైసెన్సులు, ఓ ఫారంలను తనిఖీ చేశారు. రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలని, ఇబ్బందులుంటే ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. డీలర్లు అందరూ పీసీలు, ఓ ఫారంలను జతపరచాలని, రైతులకు అవసరాలకు తగినంత యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని తెలిపారు.