కూసుమంచి మండలంలోని లోక్యతండాలో మూడు రోజుల పాటు జరిగిన హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుల పెద్దలు, సర్పంచ్ డప్పు కొట్టి వేడుకలను ప్రారంభించారు. వేలాది మంది బంజారాలు తమ సంప్రదాయ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, మహిళల గానలహరి, యువకుల నృత్యాలతో తండా అంతా పండగ వాతావరణాన్ని సృష్టించారు.