ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండాలో బుధవారం హోలీ వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. తెల్లవారుజామున గిరిజనులు కట్టెలు పేర్చి, పెద్దల సమక్షంలో కాముని దహనం చేశారు. డప్పుల చప్పుళ్ల మధ్య మహిళలు, పిల్లలు మంటల చుట్టూ తిరుగుతూ మొక్కులు తీర్చుకున్నారు. పురుషులు, యువకులు 'చెర్రా' అంటూ ఉత్సాహంగా సందడి చేశారు. లోక్యతండాలో మూడు రోజుల పాటు హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.