కూసుమంచి మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా బొలికొండ పాపయ్య, మంద నాగేశ్వరరావు శుక్రవారం కూసుమంచిలో జరిగిన మండల మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.