కూసుమంచిలో వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చిన ఓ వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడి కాలు విరిగి, తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.