కూసుమంచి: రాజుపేట వద్ద ఉద్ధృతి.. రాకపోకలు బంద్

కూసుమంచి మండలం రాజుపేట వద్ద పాలేరు నదిలో వరద ఉద్ధృతి ప్రమాదకరంగా మారింది. పాలేరు అలుగు నుంచి 37 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో, రాజుపేట వంతెనపై ఐదు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీంతో పెరికసింగారం-రాజుపేట మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్