విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్య రంగ అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు.