కూసుమంచి మండలంలో విద్యుత్ స్తంభాలు వేసే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి భీష్మచారి అనే వ్యక్తి మృతి చెందాడు. నాయకన్ గూడెం గ్రామానికి చెందిన భీష్మచారి, సూర్యాపేట జిల్లా తాళ్లకాంపాడు వద్ద విద్యుత్ స్తంభాలు నాటే పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆయన నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో భీష్మచారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.