కూసుమంచి: ముమ్మరంగా యూటీ నిర్మాణ పనులు

గత ఏడాది పాలేరు రిజర్వాయర్ కు భారీ వరద చేరగా సాగర్ ఎడమ కాల్వపై కూసుమంచి మండలం హట్యాతండా వద్ద ఉన్న యూటీ(అండర్ టన్నెల్) కొట్టుకుపోయింది. దీంతో పాత యూటీని తొలగించి 77 మీటర్ల పొడవుతో కొత్తది నిర్మిస్తున్నారు. ఇది భారీ వరదలు వచ్చినా తట్టుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో 120 మంది కార్మికులు రెండు షిఫ్ట్ లుగా పనిచేస్తున్నారు. వానాకాలం పంటలకు నీరు ఇచ్చేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్