కూసుమంచి: భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద గల భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి అధికారులు సాగర్ జలాలు విడుదల చేశారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్ స్విచ్ ఆన్ చేసి నీటి విడుదల చేశారు. ప్రస్తుతానికి 275 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీటితో తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లోని చెరువులను నింపనున్నారు. ఈ కార్యక్రమంలో ఐబీ డీఈ బాణాల రమేష్ రెడ్డి, కూసుమంచి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్