ఆరెంపులలో ప్రజాదర్బార్... పాల్గొన్న మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను, మున్సిపాలిటీలను క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజల వ్యక్తిగత సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని మంత్రి తెలిపారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్