రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నుంచి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు వార్డుల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అంతేకాక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈమేరకు శనివారం 7-30 గంటలకు 6వ వార్డులో మంత్రి పర్యటన మొదలుకానుంది, ఆతర్వాత 5, 4, 3, 25వ వార్డుల్లో కొనసాగుతుంది.