రేపు తిరుమలాయపాలెంలో మంత్రి పర్యటన

తిరుమలాయపాలెం మండలంలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పీఎ రాఘవరావు ఓ ప్రకటన విడుదల చేశారు. మండల పరిధిలోని ఆజ్మీరతండా, జల్లేపల్లి, హైదరాసాయిపేట, సుబ్లేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్