నేలకొండపల్లి: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. కాగా, కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. విద్యుత్ స్తంభం విరిగిపడటంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్