నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా కార్యాచరణ సిద్దం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను చక్కబెడుతూనే ఒక్కో హామీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇబ్బంది ఎదురుకాకుండా సాగునీటి సరఫరాకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.