నేలకొండపల్లి: వడదెబ్బకు గురై వ్యక్తి మృతి

వడదెబ్బకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా. మండలంలోని చెరువుమాదారం గ్రామానికి చెందిన సురపల్లి దానయ్య (60) ఎండ వేడి తట్టుకోలేక ఒకసారిగా ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్