తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లి మండలంలోని వ్యవసాయ భూముల వద్ద పర్యటించి పల్లె ప్రజల జీవనశైలిపై పరిశీలన చేశారు. మొదటగా పెసర పంట పొలాలను సందర్శించారు. రైతులతో ముచ్చటించారు. పంటల పెంపకం, సాగు పరిస్థితులు, సాగునీటి సమస్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.