నెలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన షేక్ కుతుబుద్దీన్ బాబా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ మోసంలో రూ. 84,000 కోల్పోయారు. వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోల్డ్‌లో ఉన్న రూ. 8,000లను కోర్టు అనుమతితో రప్పించి, మంగళవారం బాధితుడికి ఎస్ఐ సంతోష్ అందజేశారు. ఈ కేసులో చొరవ చూపిన సైబర్ వారియర్ నాగరాజును ఎస్ఐ అభినందించారు.