నెలకొండపల్లి మండలం చెరువు మాదారం సబ్ సెంటర్లో బుధవారం నిర్వహించిన సురక్షిత మాతృత్వ అవగాహన సదస్సులో డాక్టర్ సన గర్భిణులకు ఆరోగ్య సూచనలు చేశారు. వారు అప్రమత్తంగా ఉండాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్ మాత్రలు వాడుతూ, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.