నేలకొండపల్లి: ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

శనివారం నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కావున రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్