నేలకొండపల్లి: పది లీటర్ల నాటుసారా స్వాధీనం

నేలకొండపల్లి ఎక్సైజ్ సర్కిల్ అధికారులు శనివారం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. శంకరగిరి తండాలో పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. స్కూటీతో పాటు పార్వతిని అదుపులోకి తీసుకుని, ఆమెపై కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన బెల్లం వ్యాపారి వెంకటరమణ పరారీలో ఉన్నాడని సీఐ ఎస్. రమేశ్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ లత, సిబ్బంది శ్రీనివాస్, సంపూర్ణ, బలరాం, వినీత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్