నేలకొండపల్లి: కౌలు రైతులకు భరోసా ఇవ్వాలి

కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నేలకొండపల్లి తహసీల్దార్ కు అందించారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ఎకరాకు రూ. 15 వేలు విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్