నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విసృతంగా పర్యటించారు. మండలంలోని సుర్థేపల్లి, కోనాయిగూడెం, మంగాపురం తండా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల 54 వేల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.