నేలకొండపల్లి మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఉచితంగా అందించే యూనిఫాంలు చేరాయి. శుక్రవారం స్థానిక సింగరెడ్డిపాలెం అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి చిన్నారులకు యూనిఫాంలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్, సీడీపీవో కవిత, సూపర్వైజర్ నాగమణి, టీచర్లు, ఆయాలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఉచితంగా యూనిఫాంలు అందించాలని నిర్ణయించింది.