లోక్ అదాలత్ లో కేసును ఇరుపక్షాలు రాజీ చేసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అంతిమ తీర్పుపై ఎటువంటి అప్పీల్ కు అవకాశం వుండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్ తెలిపారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వి. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.